మధ్యప్రదేశ్‌ అడవి మధ్యలో.. కళ్లు జిగేల్‌ మనేలా ఎర్ర రంగు రోడ్డు?

ABN, Publish Date - Dec 20 , 2025 | 11:33 AM

సాధారణంగా రోడ్లంటే నల్లగా ఉంటాయి. కాంక్రీట్ రోడ్లంటే బూడిద రంగులో ఉంటాయి. మధ్య ప్రదేశ్‌లో నిర్మించిన ఎరుపు రంగు రహదారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా రోడ్లంటే నల్లగా ఉంటాయి. కాంక్రీట్ రోడ్లంటే బూడిద రంగులో ఉంటాయి. మధ్య ప్రదేశ్‌లో నిర్మించిన ఎరుపు రంగు రహదారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మనం చూసే నలుపు, బూడిద రంగు రోడ్లకు భిన్నంగా .. ఎన్‌హెచ్ఏఐ చేసిన ఈ ప్రయోగం సాంకేతిక, భద్రతా కారాణాలు ఉన్నాయట. మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్, భోపాల్ జాతీయ రహదారి నౌరోదేహీ అభయారణ్యం గుండా వెళ్లే ఈ రోడ్డుకు 12 కిలోమీటర్ల మేర ఎరుపు రంగు వేశారు. వన్య ప్రాణులు రోడ్డును దాటే అవకాశం ఉన్నందున రోడ్డుపై ఎరుపు రంగు వేశారు. అంతేకాదు.. మలుపు ప్రాంతాల్లో ఎరుపు రంగు కారణంగా డ్రైవర్లకు రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది.


ఇవి చదవండి

నగరంలో మరో కొత్తమోసం వెలుగులోకి.. న్యూడ్‌ వీడియో కాల్‌ స్కామ్‌..

ఏకంగా ఆస్పత్రిలోనే డ్రగ్స్ వినియోగం.. వ్యక్తి అరెస్ట్

Updated at - Dec 20 , 2025 | 11:34 AM