Summer Effect: మొదలైన ఎండలు.. కాశ్మీర్‌కు పరుగులు పెడుతున్న ప్రజలు
ABN, Publish Date - Feb 10 , 2025 | 08:38 AM
ఎండాకాలం అప్పుడే వచ్చిందా. ఈ ఏడాది హీట్ వేవ్ రికార్డులు బద్ధలవుతాయా. ఢిల్లీతో సహా ఉత్తరాది వారంతా సేదతీరడానికి కశ్మీర్ లాంటి ప్రాంతాలకు వెళ్లక తప్పదా. ఫిబ్రవరిలోనే ఎందుకు ఎండలు మండిపోతున్నాయి.
ఎండాకాలం అప్పుడే వచ్చిందా. ఈ ఏడాది హీట్ వేవ్ రికార్డులు బద్ధలవుతాయా. ఢిల్లీతో సహా ఉత్తరాది వారంతా సేదతీరడానికి కశ్మీర్ లాంటి ప్రాంతాలకు వెళ్లక తప్పదా. ఫిబ్రవరిలోనే ఎందుకు ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌లో ఉండాల్సిన ఎండలు ఫిబ్రవరిలోనే పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. భానుడు భగభగ మంటున్నాడు. ఉదయం తొమ్మిది తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
ఆ సాధారణ వేడి వాతావరణంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. భూతాపం కారణంగా చరిత్రలోనే 2024 అంత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఆ రికార్డును 2025 బద్దలు కొట్టనుంది. ఫిబ్రవరి తొలివారంలోనే డే టెంపరేచర్ 35 డిగ్రీలను దాటేసిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఎండాలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. గ్రీన్ హౌస్, వాయు ప్రభావం బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగం పెరగడం లాంటి ఎన్నో కారణాల వల్ల భూ మండలం వేడెక్కుతోంది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 10 , 2025 | 11:00 AM