గర్భస్త శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స
ABN, Publish Date - Jan 04 , 2025 | 04:13 PM
Telangana: బంజారాహిల్స్ రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులు.. బెలూన్ డైలేషన్‌తో పాటు లెఫ్ట్ వెంట్రిక్యులార్ డివైజ్ క్లోజర్ ప్రక్రియను గర్భస్త శిశువుకు నిర్వహించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ ప్రక్రియను నిర్వహించామని డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్, జనవరి 4: ఓ అరుదైన శస్త్ర చికిత్సను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి (Rainbow Hospital) వైద్యులు దిగ్విజయంగా నిర్వహించారు. బెలూన్ డైలేషన్‌తో పాటు లెఫ్ట్ వెంట్రిక్యులార్ డివైజ్ క్లోజర్ ప్రక్రియను గర్భస్త శిశువుకు నిర్వహించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ ప్రక్రియను నిర్వహించామని డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ‘‘హిందూపూర్ నుంచి ఓ గర్భిణీ స్త్రీ మా ఆస్పత్రికి వచ్చారు. ఆమెకు అప్పుడు 27 వేరాలు. గర్భంలో శిశువు హైఏటిక్ వాల్ బాగా బ్లాక్ అయ్యింది. హార్ట్ ఫంక్షన్ కూడా డ్యామేజ్ అయ్యింది. ఫీటల్ బెలూన్ హైఏటిక్ వాల్వాటమి అంటే పుట్టకముందే వాల్వ్‌ను తెరవాలని నిర్ణయించి బేబీకి అనస్తీషియా ఇచ్చి అల్ట్రా సౌండ్ గైడెన్స్‌లో హైఏటిక్ వాల్‌ను ఓపెన్ చేశాం. ఆ రంధ్రం ద్వారా రక్తం బయటకు వచ్చేప్రమాదం ఉన్నందున.. రంధ్రానికి బటన్ పెట్టి క్లోజ్ చేసి హార్ట్‌ను నార్మల్ పొజిషన్‌కు తీసుకువచ్చాం. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి ప్రక్రియ జరగలేదు’’ అని డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇక వారిలో వణుకే
రూరల్ ఇండియా మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu news
Updated at - Jan 04 , 2025 | 04:14 PM