సీఎం రేవంత్ ని చాలా తక్కువ అంచనా వేసా.. కానీ..!

ABN, Publish Date - Jul 24 , 2025 | 08:35 PM

విజయవంతంగా కుల గణన నిర్వహించడమంటే అంత ఈజీ కాద ని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రేవంత్‌ సహా కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంచనాలకు మించి రాణించారంటూ ఆయన కితాబు ఇచ్చారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలో కుల గణనను ప్రభుత్వం స్ఫూర్తిదాయకంగా నిర్వహించిందన్నారు. గురువారం న్యూఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాభవన్‌లో తెలంగాణలో కుల గణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలో కుల గణన సర్వే చేపట్టాలని రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చానని గుర్తు చేసుకున్నారు.

55 ప్రశ్నలతో క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఈ కుల గణన చేపట్టారని వివరించారు. విజయవంతంగా కుల గణన నిర్వహించడమంటే అంత ఈజీ కాదన్నారు. రేవంత్‌ సహా కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంచనాలకు మించి రాణించారంటూ కితాబు ఇచ్చారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలురాయిగా నిలుస్తుందని అభివర్ణించారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.

ఈ వీడియోలను వీక్షించండి..

తిక్కలోడు..! పాలన చేతకాక..!

ఆ రోజే చెప్పా కులగణనకు అడ్డు వస్తే సొంత నేతలైనా ఊరుకోను.. |

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 24 , 2025 | 08:35 PM