ప్రపంచ ప్రఖ్యాత వేదికపై తెలుగు వ్యక్తి

ABN, Publish Date - Jul 05 , 2025 | 11:09 AM

Rahul Attuluri World Economic Forum: చైనాలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించిన యాన్యువల్ మీటింగ్ ఆఫ్‌ ద న్యూ ఛాంపియన్స్ వేదికపై నెక్స్ట్‌ వేవ్ కో ఫౌండర్ అండ్ సీఈవో రాహుల్ అత్తులూరి మాట్లాడారు. ఏఐ యుగంలో యువతకు కొత్త అవకాశాలు ఎలా సృష్టించాలనే విషయంపై తన ఆలోచనలు పంచుకున్నారు.

కరీంనగర్, జులై 4: తెలంగాణ రాష్ట్రం రామగుండానికి చెందిన వ్యక్తికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేదికపై తెలుగు వ్యక్తి ప్రసంగించారు. చైనాలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (World Economic Forum) నిర్వహించిన యాన్యువల్ మీటింగ్ ఆఫ్‌ ద న్యూ ఛాంపియన్స్ వేదికపై నెక్స్ట్‌ వేవ్ కో ఫౌండర్ అండ్ సీఈవో రాహుల్ అత్తులూరి (Next Wave Co-Founder and CEO Rahul Attuluri) మాట్లాడారు. ఏఐ యుగంలో యువతకు కొత్త అవకాశాలు ఎలా సృష్టించాలనే విషయంపై తన ఆలోచనలు పంచుకున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ స్కిల్స్‌ ఉన్న వారి కోసం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుందన్నారు. జొనవేటివ్ ఏఐ వల్ల భారీ స్థాయిలో అవకాశాలు వస్తాయని, దీని కోసం భారత్ సిద్ధంగా ఉండాలని సూచించారు. యువత కేవలం ఏఐ స్కిల్స్ మాత్రమే కాకుండా మానవతా విలువలతో కూడిన నైపుణ్యాలూ నేర్చుకోవాలని రాహుల్ అత్తులూరి కోరారు.

Updated at - Jul 05 , 2025 | 11:09 AM