Operation Abhyas: రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో ఆపరేషన్ అభ్యాస్..

ABN, Publish Date - May 07 , 2025 | 04:43 PM

పాకిస్థాన్ తో యుద్ధం నేపథ్యంలో రాజధాని నగరం హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్ నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

Operation Abhyas: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ అభ్యాస్’ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్‌లో పాక్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చేశారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనేదానిపై సమగ్రంగా తర్ఫీదు నిచ్చారు. అత్యవసర పరిస్థితులపై అప్రమత్తం చేసేందుకే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు.

హైదరాబాద్‌లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. వీటిలో నానల్ నగర్, కంచన్ బాగ్, సికింద్రాబాద్‌ ఉన్నాయి. ఈసీఐఎల్, ఎన్ఎఫ్‌సీ ప్రాంతాల్లోనూ మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ ఆరంభ సూచనగా రెండు నిమిషాల పాటు సైరన్ మ్రోగించారు. సైరన్ మ్రోగగానే ప్రజలు జాగ్రత్తలు తీసుకునేలా తర్ఫీదునిచ్చారు. సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు.

Updated at - May 07 , 2025 | 04:43 PM