స్త్రీ శక్తి హస్తకళ స్టోర్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
ABN, Publish Date - Nov 08 , 2025 | 08:27 PM
స్త్రీ శక్తి హస్తకళ స్టోర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి ప్రారంభించారు.
హైదరాబాద్, నవంబర్ 08: స్త్రీ శక్తి హస్త కళ స్టోర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 600 మందికిపైగా శిక్షణ పొందారు. వారి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తొలి స్టోర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. స్త్రీ అంటే ప్రేమ, అభిమానం, ధైర్యం అని తెలిపారు. ఇవన్ని స్త్రీలోనే ఉంటాయని చెప్పారు. ఒక స్త్రీ.. తల్లిగా, భార్యగా, చెల్లిగా చాలా బాధ్యతలు తనపై వేసుకుని ముందుకు వెళ్తుందన్నారు. అదే సృష్టి అంటే అని ఆమె అభివర్ణించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు..మీరు కూడా చేయరా..?
తాట తీసి కూర్చోబెడుతా..! స్మగ్లర్లకు పవన్ వార్నింగ్
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 08 , 2025 | 08:30 PM