ఓ వ్యక్తి బట్టతలపై కూర్చున్న కోతి
ABN, Publish Date - Nov 08 , 2025 | 04:49 PM
ఓ వ్యక్తి బట్ట తలపై కోతి కూర్చున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెట్టు కింద సేద తీరుతున్న వ్యక్తి తలపై ఉన్నట్టుండి కోతి వచ్చి కూర్చుంది.
పెద్దపల్లి జిల్లా, నవంబర్ 8: జిల్లాలోని సుల్తానాబాద్‌లో కోతి ఓ వ్యక్తి తలపై ఎక్కి కూర్చుంది. స్థానిక గాంధీనగర్‌కు చెందిన బుచ్చయ్య చెట్టు కింద కుర్చీలో సేద తీరుతూ ఉండగా.. చెట్టుపై ఉన్న కోతి బుచ్చయ్య బట్టతలపై వచ్చి కూర్చుంది. దీంతో బుచ్చయ్య ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. అయితే కాసేపు తలపై కూర్చున్న కోతి ఎలాంటి గాయం చేయకుండా వెళ్లిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి...
మద్యం సేవించి ట్రాక్టర్ కింద పడుకున్నాడు.. తెల్లారేసరికి ఘోరం
నా ఆట చూపిస్తా... బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News
Updated at - Nov 08 , 2025 | 04:49 PM