తహశీల్దార్‌పై ఎమ్మెల్యే బూతుపురాణం

ABN, Publish Date - May 17 , 2025 | 11:49 AM

MLA Vs MRO: తహశీల్దార్‌పై ఎమ్మెల్యే బూతుపురాణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత రాత్రి పదిగంటల సమయంలో తనకు ఫోన్ చేసి బూతులతో విరుచుకుపడ్డారంటూ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పార్వతీపురం మన్యం, మే 17: జిల్లాలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మార్వో అన్నట్లుగా పరిస్థితి మారింది. ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై (MLA Bonela Vijayachandra) తహశీల్దార్ విజయలక్ష్మి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత రాత్రి పదిగంటల సమయంలో తనకు ఫోన్ చేసి బూతులతో విరుచుకుపడ్డారంటూ ఎమ్మెల్యేపై ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తనపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసులకు వాట్సప్ ద్వారా పంపిన తహశీల్దార్ విజయలక్ష్మి ఫిర్యాదు లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.


అయితే తహసీల్దార్ ఫిర్యాదుపై ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీవ్రంగా స్పందించారు. తహసీల్దార్ పెద్ద అవినీతిపరురాలని.. ఆమెకు మతిస్థిమితం లేదని ఆరోపించారు. రెవెన్యూ సర్వీసులో పనిచేయటానికి ఆమె అనర్హురాలని ఎమ్మెల్యే విమర్శించారు. తహశీల్దార్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో తాను చాలా సార్లు ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదన్నారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయే సరికి రాత్రి వాట్సప్ కాల్ చేసిన మాట వాస్తవమని తెలిపారు. తహసీల్దార్‌పై రెవెన్యూశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. తహశీల్దార్ క్షమాపణలు చెప్పకపోతే ఏం చేయాలో అది చేసి తీరుతానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. కాగా.. తహశీల్దార్‌పై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తహశీల్దార్‌కు మతిస్థిమితం లేదంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడంపట్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్రమై అసహనం, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే, తహశీల్దార్ మధ్య జరుగుతున్న వార్ ఒక్కసారిగా బహిర్గతమవడం చర్చకు దారి తీసింది.


ఇవి కూడా చదవండి

Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

YS Jaganmohan Reddy: జగన్‌ షాడో..

Read Latest AP News And Telugu News

Updated at - May 17 , 2025 | 02:04 PM