తప్పకుండా చేసి తీరతాం.. డీఎస్సీపై లోకేష్

ABN, Publish Date - Mar 06 , 2025 | 12:16 PM

Lokesh statement on DSC: డీఎస్సీ నోటిఫికేషన్‌పై మరోసారి మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. తప్పకుండా ఖాళీలను భర్తీ చేస్తామని మండలిలో మంత్రి స్పష్టం చేశారు.

అమరావతి, మార్చి 6: ఏపీ శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. డీఎస్సీపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ (Minister Nara Lokesh) సమాధానం ఇచ్చింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి తప్పులు, గతంలో వచ్చిన నోటిఫికేషన్లను స్టడీ చేసి పక్కా ప్రణాళికతో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. 4330 పోస్టులకు గాను 1048 పోస్టుల మాత్రమే భర్తీ అయ్యాయని.. మిగిలిన 3282 పోస్టులను వచ్చే సంవత్సరంలో భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Foundation Stone: ఎన్టీఆర్ ట్రస్టు భవన్ శంకుస్థాపన.. భువనేశ్వరి పూజలు..

BJP victory: బీజేపీదే గెలుపు

Read Latest AP News And Telugu News

Updated at - Mar 06 , 2025 | 12:22 PM