రవీంద్రనాథ్ బాబును ఎందుకు ఆహ్వానించారు..మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం

ABN, Publish Date - Jan 29 , 2025 | 09:33 PM

నాయి బ్రాహ్మణుల కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించడంపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొల్లు రవీంద్రపై నాటి ఎస్పీ రవీంద్ర బాబు తప్పుడు కేసు బనాయించారు.

నాయి బ్రాహ్మణుల కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించడంపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొల్లు రవీంద్రపై నాటి ఎస్పీ రవీంద్ర బాబు తప్పుడు కేసు బనాయించారు. అయితే డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రవీంద్రనాథ్ బాబు ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో.. మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని వేధించిన వ్యక్తితో అంటకాగుతూ.. తనను ఆవమానిస్తారా? అంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులపై మండిపడ్డారు. వైసీపీ నేతలకు తొత్తులుగా పని చేసిన వారిని.. ఈ సభకు ఆహ్వానించడం బాధ కలిగించిందన్నారు. తన మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరించిన వారిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పార్టీని ఆయన కోరారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 29 , 2025 | 09:33 PM