గత ఐదేళ్లు ఏం చేశావ్..: అచ్చెన్న

ABN, Publish Date - Feb 19 , 2025 | 02:01 PM

వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్దారు. రైతుల గురించి మాట్లాడుతున్న జగన్.. గత ఐదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఆదాయం తెచ్చే శాఖలకు జగన్ తాళం వేసి బిగించారని ఆయన అన్నారు.

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు (YSRCP Chief) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) గుంటూరు (Guntur) మిర్చి యార్డు (Mirchi Yard) దగ్గర పచ్చి అబద్దాలు చెప్పారని (False Statements), ఎవరైనా నవ్వుకుంటారన్న స్పృహ కూడా జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) అన్నారు. మిర్చి ధర రూ.13 వేలకు పడిపోయిందని జగన్ చెబుతున్నారని, గత ఐదేళ్లలో ధరలు పరిశీలిస్తే.. అత్యధికంగా రూ.13 వేలు ఉందని అన్నారు. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్న జగన్.. గత ఐదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. పని లేకపోవడంతోనే జగన్ అనవసర విమర్శలు చేస్తున్నారని, గత ఐదేళ్లు జగన్ ప్యాలెస్‌కే పరిమితమయ్యారని మంత్రి ఎద్దేవా చేశారు.

ఈ వార్త కూడా చదవండి..

అభివృద్ధి చేస్తే 11 స్థానాలే ఎందుకు వచ్చాయి..


వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఆదాయం తెచ్చే శాఖలకు జగన్ తాళం వేసి బిగించారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లు నాటకాలాడి ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని, రైతుల కోసం జగన్ ఒక్క మంచి పని కూడా చేయలేదని, ఐదేళ్లలో సెంటు భూమికి కూడా భూ పరీక్షలు చేయించలేదని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది: వైఎస్ జగన్

పోలీసుల అదుపులో వైట్ కాలర్ దళారీ

ఈసీ నిబంధనలు పట్టించుకోని జగన్..

ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఇక్కడంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 19 , 2025 | 02:01 PM