Madhya Pradesh High Court: మరొకరితో ప్రేమలో భార్య.. అయినా భర్త మెయింటనెన్స్ ఇవ్వాల్సిందేనా?

ABN, Publish Date - Mar 05 , 2025 | 11:04 AM

భార్యకు భర్తలు ఇవ్వాల్సిన మెయింటనెన్స్ గురించి మనం చాలా రకాల జడ్జిమెంట్లను చూస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది.

భార్యకు భర్తలు ఇవ్వాల్సిన మెయింటనెన్స్ గురించి మనం చాలా రకాల జడ్జిమెంట్లను చూస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. భార్య వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నంతా మాత్రానా వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అక్రమ సంబంధంగా పరిగణించి.. అలాంటి అక్రమ సంబంధం వారిద్దరి మధ్య ఉందనే అంశాన్ని చూపిస్తూ మెయింటనెన్స్ ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ మొత్తం ఈ కేసు ఎంటీ.. అక్రమ సంబంధం నిరూపించాలంటే ఎలాంటి అంశాలు ఉండాలో తెలుసుకుందాం. ఇందుకు సంబంధించి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి పోతురెడ్డి కృష్ణకాంత్ పలు కీలక విషయాలు ఏబీఎన్‌తో పంచుకున్నారు. అమిత్ కోడైక్, మాధురి కేసు పరంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని తెలిపారు.


అమిత్ అనే వ్యక్తి తన భార్యకు మెయొంటనెన్స్ ఇవ్వలేనని చెప్పాడు. ఇందుకు గల కారణాలను కూడా న్యాయమూర్తికి వివరించాడు. తన జీతమే రూ. 8 వేలు అందులో హిందు చట్ట ప్రకారం రూ. 4 వేలు ఇస్తున్నానని తెలిపాడు. అలాగే తాను ఇస్తున్న రూ. 4 వేలతో పాటు సీఆర్పీసీ125 చట్ట ప్రకారం మరో రూ. 4 వేలు ఇవ్వాలని తన భార్య డిమాండ్ చేస్తోందని.. తన జీతం అంతగా లేదని తాను అంతా ఇచ్చుకోలేనని కోర్టులో విన్నవించాడు. తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని.. ఆమె మెయింటనెన్స్ తీసుకోడానికి అనర్హురాలు అని అతను కోర్టులో చెప్పాడు. మధ్యప్రదేశ్ హై కోర్టు కూడా అతను చెప్పిన విషయాలపై వాదించింది. కేవలం నీ భార్య వేరో అతనితో ప్రేమలో ఉందనే విషయం ఒకటే నీ మెయింటనెన్స్ ఇవ్వకపోవడానికి అనర్హతగా నిర్ణయించదని హై కోర్టు స్పష్టం చేసింది. ఆమె నిజంగా అతనితో ఫిజికల్ రిలేషన్ షిప్‌లో ఉందని నిరూపించగలిగితేనే నువ్వు ఇచ్చే మెయింటనెన్స్‌కు అనర్హురాలు అని చెప్పింది. అతనితో ప్రేమలో ఉందని చెబితే సరిపోదని మధ్య ప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.


మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 05 , 2025 | 11:09 AM