భారత్‌ను వణికిస్తున్న కొత్త వైరస్..మరో లాక్ డౌన్..?
ABN, Publish Date - Jan 07 , 2025 | 09:33 PM
Lock Down Danger To India: ప్రపంచంలో కోరనా వైరస్ ప్రబలినప్పుడు.. ఏం ఫర్వాలేదన్నారు. అనంతరం లాక్ డౌన్స్. హెచ్ఎంపీవీ వైరస్ విషయంలోను ప్రభుత్వాలు అలాగే ప్రవర్తిస్తున్నట్లు ఉన్నాయా?. అదేమంత డేంజర్ వైరస్ కాదంటూనే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు చెబుతున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ విస్తరిస్తుంటే.. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయా? దేశంలోకి ఎంటరైన చైనా వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతోన్నాయి.
ప్రపంచంలో కోరనా వైరస్ ప్రబలినప్పుడు.. ఏం ఫర్వాలేదన్నారు. అనంతరం లాక్ డౌన్స్. హెచ్ఎంపీవీ వైరస్ విషయంలోను ప్రభుత్వాలు అలాగే ప్రవర్తిస్తున్నట్లు ఉన్నాయా?. అదేమంత డేంజర్ వైరస్ కాదంటూనే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు చెబుతున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ విస్తరిస్తుంటే.. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయా? దేశంలోకి ఎంటరైన చైనా వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతోన్నాయి. దీంతో దేశమంతా తీవ్ర ఆందోళన నెలకొంది. వైరస్ వ్యాప్తికి శీతాకాలం అనుకూలమైంది కావడం కూడా అందుకు ప్రధాన కారణం.. బెంగళూరు, అహ్మదాబాదే కాదు.. చెన్నై, సేలం సహా అనేక నగరాల్లో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఈ వైరస్ చిన్నారులకు సోకినట్లు ప్రభుత్వాలు సైతం ధృవీకరించాయి. ఇక తమ దేశంలో ఏం జరుగుతుందో మాత్రం చైనా చెప్పడం లేదు. ఈ వ్యవహారంలో పారదర్శకంగా ఉండాలంటూ వివిధ దేశాల ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 07 , 2025 | 09:33 PM