బాంబులేటి నువ్వు మాట్లాడుతున్నావా.. కేటీఆర్ పంచులే పంచులు

ABN, Publish Date - Jan 07 , 2025 | 09:22 PM

కాంగ్రెస్, బీజేపీ వేర్వేరు కాదని.. రెండు ఒక్కటేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభివర్ణించారు. ఈ రెండు పార్టీలు వేర్వేరని మీరు అనుకుంటున్నారేమో కానీ.. తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలు ఏ టీమ్, బి టీమ్ అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ బీజేపీయే.. కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంలాగా పని చేస్తుందన్నారు. ఈ రెండు పార్టీల్లో ఏదీ ఏ టీమో తమకు తెలియదన్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలకు ఒకదానితో ఒకటి అల్లుకు పోయినాయి.. కలిసి పని చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్, బీజేపీ వేర్వేరు కాదని.. రెండు ఒక్కటేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభివర్ణించారు. ఈ రెండు పార్టీలు వేర్వేరని మీరు అనుకుంటున్నారేమో కానీ.. తాను అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలు ఏ టీమ్, బి టీమ్ అని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల్లో ఏదీ ఏ టీమో తమకు తెలియదన్నారు. ఇక్కడ బీజేపీయే.. కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంలాగా పని చేస్తుందన్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలకు ఒకదానితో ఒకటి అల్లుకు పోయినాయి.. కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. ఇవన్నీ తమకు కొత్త కాదన్నారు. ఈ తరహ ఘటనలు గతంలో చూశామని.. భవిష్యత్తులో సైతం చూస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలను గతంలో చిత్తు చేసి.. తాము రెండు సార్లు అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. భవిష్యత్తులో సైతం ప్రజల ఆశీస్సులతో... ఈ కేసులను న్యాయవ్యవస్థ ద్వారా ఎదుర్కొంటామని చెప్పారు. ప్రజా క్షేత్రంలో ఈ రెండు పార్టీలను కూడా ఎదుర్కొంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 07 , 2025 | 09:22 PM