సినీ నిర్మాత కేదార్ మృతి పై రాజకీయ దుమారం.. అసలు జరిగింది ఏంటంటే?

ABN, Publish Date - Feb 26 , 2025 | 10:10 PM

సినీ నిర్మాత కేదార్ మృతిపై రాజకీయ దుమారం రేగుతోంది. కేదార్ మృతిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని సీఎం రేవంత్ ప్రశ్నిచారు. తెలంగాణ రాజకీయాల్లో కేదార్ మరణం సంచలనం రేకెత్తిస్తోంది. టాలీవుడ్ యువ నిర్మాత కేదార్ శెలగంశెట్టి మంగళవారం రాత్రి దుబాయ్‌లో ఆకస్మాత్తుగా మరణించారు. దుబాయ్‌లో సినీ ఫైనాన్షియర్ కుమారుడు వివాహ వేడుకలు జరుగుతోన్నాయి. అందులోభాగంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలో స్నేహితులతో కలిసి కేదార్ పార్టీకి హాజరయ్యారు. అనంతరం తన ఫ్లాట్‌లో నిద్రపోయారు.

కానీ ఆయన ప్లాట్‌లో విగత జీవిగా పడి ఉన్నారు. కేదార్ మరణానికి అనారోగ్యమే కారణమా ? లేక ఏదైనా కారణముందా? అనేది తెలియాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం ప్రముఖ రాజకీయ నాయకుడు ఇచ్చిన కొకైన్ పార్టీకి కేదార్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పోలీసులు రైడ్ చేసి సినీ ప్రముఖులతోపాటు కేదార్‌పై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా కేదార్‌ను ఏ 4 నిందితుడిగా చేర్చారు. అదీకాక కేదార్‌కు వివిధ రంగాలకు చెదిన ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. అలాగే అతడు సినీ నిర్మాతగా మారకుముందు నుంచి ఓ పబ్‌ నిర్వహరణలో భాగస్వామిగా ఉన్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 26 , 2025 | 10:10 PM