నిన్నటిదాకా ఒక లెక్క.. రేపటి నుండి ఒక లెక్క.. తోలు తీస్తా

ABN, Publish Date - Dec 21 , 2025 | 07:25 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతామని స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతామని స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామ గ్రామాన ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభలకు తాను సైతం వస్తానని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని గుర్తు చేశారు. ఇకపై మౌనంగా ఉండేది లేదన్నారు.


పాలమూరుపై కేంద్రాన్ని ఎండగడగామని చెప్పారు. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నోరుమూసుకుని ఉంటే.. తామైనా పూనుకోవాలి కదా అని అన్నారు. కళ్లముందే ఇంత మోసం జరుగుతుంటే కేసీఆర్ మౌనంగా ఉంటారా? అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇవాళ్లి వరకూ ఒక కథ.. రేపటి నుంచి మరో కథ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

చిన్న వెంకన్న గ్రామోత్సవ వీధుల్లో మాంసం అమ్మకాలు

రాహుల్ ఒక్కడే కనిపిస్తడు..కేసీఆర్ ఈజ్ బ్యాక్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 21 , 2025 | 07:44 PM