జగన్ తప్పుల వల్ల నిధులు ఆలస్యం: రామ్మోహన్ నాయుడు
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:52 PM
పోలవరం ప్రాజెక్టు ఏపీ రాష్టానికి జీవ నాడి లాంటిదని, అలాంటి ప్రాజెక్ట్‌ను జగన్ ప్రభుత్వం పక్కన పెట్టిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్ల కేంద్రం నుండి నిధులు రావాలంటే ఆలస్యం అవుతోందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా సర్వ నాశనం చేసారని ఆయన మండిపడ్డారు.
గుంటూరు జిల్లా: రాష్ట్రంలో అభివృద్ధికి మంచి పునాదులు పడాలని కూటమికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారని, ఫిబ్రవరి1 తేదీన కేంద్ర బడ్జెట్ (Central Budget) ప్రవేశపెట్టారని 140 కోట్ల మంది ప్రజలకు మేలు కెలిగేలా బడ్జెట్ ప్రతిపాదించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Central Minister Rammohan Naidu) అన్నారు. మంగళవారం ఆయన గుంటూరు (Guntur)లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అని అన్నారు. జలజీవన్ పధకం క్రింద రూ. 15 వేల కోట్లు వస్తే వైసీపీ ప్రభుత్వం డబ్బులను దుర్వినియోగం చేసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఈ వార్త కూడా చదవండి..
రణవీర్ అలహాబాదియా కేసు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు..
పోలవరం ప్రాజెక్టు ఏపీ రాష్టానికి జీవ నాడి లాంటిదని, అలాంటి ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్ల కేంద్రం నుండి నిధులు రావాలంటే ఆలస్యం అవుతోందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా సర్వ నాశనం చేసారని, మూడు రాజధానులు అంటు రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాగ్‌రాజ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్
సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్‌ను ప్రారంభించనున్న సీఎం
నోటీసు తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయిన ముద్రగడ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 18 , 2025 | 01:52 PM