భారీగా డ్రగ్స్ సీజ్

ABN, First Publish Date - 2025-04-05T16:00:19+05:30 IST

Nigerian Drug Network: నగరంలో భారీ డ్రగ్ నెట్వర్క్‌ను నార్కోటిక్ పోలీసులు చేధించారు. డ్రగ్స్ కోసం విదేశాలకు డబ్బు తరలిస్తున్న ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 5: నగరంలో భారీ డ్రగ్ నెట్‌వర్క్‌ను (Drugs Network) నార్కొటిక్ పోలీసులు చేధించారు. ఎండీఎంఏ కొకైన్ కోసం విదేశాలకు డబ్బు తరలిస్తున్న ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12.50 లక్షల విలువ చేసే కొకైన్, ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ముంబై, ఢిల్లీలో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, ఆ ఖాతాల నుంచి విదేశాలకు డబ్బు తరలిస్తున్నారని నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు. గత 3 నెలలుగా నిఘా ఈ ముఠాపై నిఘా పెట్టామని.. డ్రగ్స్‌ను క్యాష్ ఆన్ డెలివరీ చేస్తున్నారని తెలిపారు. డ్రగ్స్‌ను డెలివరీ చేసేందుకు అమ్మాయిలను ఈ ముఠా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.


బుర్ఖా ధరించి ఓ యువతి టోలిచౌకిలో డ్రగ్స్ డెలివరీ చేసిందని.. యువతిని ఫాలో అయి డ్రగ్స్ మని ట్రైల్‌ను చేధించామని వెల్లడించారు. యువతిని డ్రగ్స్ డెలివరీ కోసమే వాడతారన్నారు. యువతికి 50 వేలు ఇచ్చి డ్రగ్స్ డెలివరీ చేయించారన్నారు .బ్యాంక్ లావాదేవీలు మొత్తం పెన్ డ్రైవ్‌లో స్టోర్ చేసుకున్నారని చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా డ్రగ్స్ ద్వారా నైజీరియాకు వెళ్లిన డబ్బుల వివరాలు సేకరించినట్లు సందీప్ శాండిల్య వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

Maoists surrender: తెలంగాణలో భారీగా లొంగిపోతున్న మావోయిస్టులు

KCR Skips Meeting: సెలెక్షన్ కమిటీ సమావేశానికి కేసీఆర్ గైర్హాజరు

Read Latest Telangana News And Telugu News

Updated at - 2025-04-05T16:07:34+05:30