Hyderabad : శివలింగంపై గోమాంసం.. ఆలయం వద్ద భక్తుల ఆందోళన

ABN, Publish Date - Feb 13 , 2025 | 12:04 PM

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో గుర్తుతెలియని దుండగులు దారుణానికి ఒడిగట్టారు. టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల శివాలయంలోని శివలింగంపై మాంసపు ముద్దలు వేసి కలకలం సృష్టించారు.

హైదరాబాద్‌: ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో గుర్తుతెలియని దుండగులు దారుణానికి ఒడిగట్టారు. టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల శివాలయంలోని శివలింగంపై మాంసపు ముద్దలు వేసి కలకలం సృష్టించారు. పూజలు చేయడానికి ఆలయానికి వెళ్లిన ఓ భక్తురాలు శివలింగంపై మాంసపు ముద్దలు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనతో పరిసరా ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దుకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీ టాస్క్‌ఫోర్స్ బలగాలతో పాటు సౌత్ వెస్ట్ జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు ఘటన ప్రాంతానికి చేరుకుని ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 13 , 2025 | 02:28 PM