Telangana High Court : కోర్ట్ అంటే లెక్కలేదా..? బుక్ మై షోపై హైకోర్ట్ ఆగ్రహం..

ABN, Publish Date - Dec 12 , 2025 | 01:54 PM

అఖండ 2 సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అంటూ బుక్ మై షోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అఖండ 2 సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అంటూ బుక్ మై షోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్‌లైన్‌లో అధిక ధరలకు విక్రయిస్తు్న్నారని హైకోర్టు ప్రశ్నించింది. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించింది.


హైకోర్టు డివిజన్ బెంచ్‌లో 14 రీల్స్ సంస్థ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. అఖండ 2పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.

Updated at - Dec 12 , 2025 | 01:54 PM