భారీ వర్షాలు.. చేపల వేటకు వెళ్లొద్దు..

ABN, Publish Date - Aug 12 , 2025 | 07:55 AM

ఈనెల 15వ తేదీ వరకూ మత్స్యకారులు చేపట వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నేడు ఏపీలోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

బంగాళాఖాతంలో రేపు(బుధవారం) అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతారవణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా భారీ వానలు కురవనున్నాయి. ఈనెల 15వ తేదీ వరకూ మత్స్యకారులు చేపట వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే నేడు ఏపీలోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా, హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వాన దంచికొడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

India Slams Pakistan Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ అణు హెచ్చరికపై.. భారత్ ఘాటు ప్రతిస్పందన

Pulivendula Ontimitta BY Elections: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు ప్రారంభం.. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Updated at - Aug 12 , 2025 | 07:56 AM