బస్సుల్లో గుండెపోట్లు
ABN, Publish Date - Sep 24 , 2025 | 01:46 PM
ఆంధ్రప్రదేశ్‌లోని బస్సుల్లో గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు గుండెపోటుతో మరణించారు. వి
ఆంధ్రప్రదేశ్‌లోని బస్సుల్లో గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు గుండెపోటుతో మరణించారు. విశాఖపట్నం సెప్టెంబర్ 2వ తేదీన రాజేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఆర్టీసీ బస్సులో వెళ్తూ.. అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి..కుప్ప కూలిపోయాడు. తోటి ప్రయాణికులు సీపీఆర్ చేసినా.. ప్రయోజనం లేకుండాపోయింది.
ఇక మంగళ, బుధవారాల్లో విశాఖపట్నంలో బస్సులో ప్రయాణిస్తు్న్న ఇద్దరు గుండె పోటుతో మరణించారు. నిన్న ఈశ్వరరావు అనే కండెక్టర్, ఈ రోజు భాస్కరరావు అనే ప్రయాణికుడు గుండె పోటుతో మృతి చెందారు. ఇక పెందుర్తిలో శ్రీకాకుళంకు చెందిన పగడాలమ్మ అనే మహిళ సైతం మృతి చెందింది. వరుస మరణాలు.. అది కూడా బస్సు ప్రయాణికుల్లో చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
గుంటూరు జిల్లాలో కలరా కలకలం.. సీజనల్ వ్యాధులతో బెంబేలెత్తుతున్న జనం
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 24 , 2025 | 01:47 PM