ఏపీ రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..

ABN, Publish Date - Jun 17 , 2025 | 02:00 PM

Good News for AP: ప్రయాణీకులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రైల్ ప్రయాణీకులు సౌకర్యార్థం పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు ప్రకటించారు.

Visakha: ప్రయాణీకులకు (Passenger) రైల్వే శాఖ (Railway) శుభవార్త (Good News) చెప్పింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Praesh) రైల్ ప్రయాణీకుల సౌకర్యార్థం పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణీకుల్లో సంతోషం వెల్లివెరిసింది. ఏయే రూట్లలో ఏయే రైళ్లకు అదనపు బోగీలు పెంచారంటే..


విశాఖ- భువనేశ్వర్- విశాఖ... విశాఖపట్నం-బ్రహ్మపుర- విశాఖపట్నం... విశాఖ-కొరాపుట్- విశాఖ... ఇంటర్ సిటీ రైళ్లకు రెండు జనరల్, రెండు సెకండ్ క్లాస్ సిటింగ్ బోగీలు జత చేశారు. అలాగే విశాఖ-భవానీపట్నం-విశాఖ... విశాఖ-గుణపూర్-విశాఖ... విశాఖ-రాయపూర్- విశాఖ... విశాఖ-కొరాపుట్-విశాఖ రైళ్లకు ఒక జనరల్ సెకండ్‌క్లాస్ బోగీ జత చేశారు. మరోవైపు శ్రీకాకుళం రోడ్ నుంచి చర్లపల్లికి నడిచే ప్రత్యేక రైలు సాంకేతిక కారణాలవల్ల ఆలస్యంగా నడుస్తోందని రైల్వే అధికారులు తెలిపారు మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఇవి కూడా చదవండి:

బనకచర్ల ప్రాజెక్టుపై వాస్తవాలు ప్రజలకు తెలియాలి..: మంత్రి నిమ్మల

వికసిత్ భారత్‌కు అమృత కాలం..

తండ్రిపై కుమార్తె రోకలి బండతో దాడి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated at - Jun 17 , 2025 | 02:00 PM