గో బ్యాక్ మార్వాడి.. తెలంగాణ లో కొత్త రచ్చ.. బీఆర్ఎస్ సైలెంట్..?
ABN, Publish Date - Aug 19 , 2025 | 08:18 AM
మార్వాడిల వ్యాపార ఆధిపత్యంపై నిరసనలు తెలంగాణలో కొత్త రాజకీయానికి తెర తీశాయి. రాష్ట్రంలో భారీగా విస్తరించిన మార్వాడిలు.. ప్రజలకు బిజినెస్ అవకాశం లేకుండా చేస్తున్నారనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది.
మార్వాడిల వ్యాపార ఆధిపత్యంపై నిరసనలు తెలంగాణలో కొత్త రాజకీయానికి తెర తీశాయి. రాష్ట్రంలో భారీగా విస్తరించిన మార్వాడిలు.. ప్రజలకు బిజినెస్ అవకాశం లేకుండా చేస్తున్నారనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. తమ వస్తువులను తక్కవ ధరకు విక్రయిస్తూ.. స్థానిక తెలుగు వ్యాపారులకు గిరాకీ లేకుండా చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. వాచ్‌మెన్ల నుంచి సర్వెంట్ల వరకు .. తమ వారికే ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారు తప్పా.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శులు సైతం ఉన్నాయి.
సికింద్రాబాద్ ఘటనలో తమపై ఇలాగే నిరసనలు కొనసాగితే.. తమ మనుగడ కష్టమంటూ మార్వాడిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మార్వాడిలు గోబ్యాక్ ఉద్యమాన్ని జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం నోరెత్తకుండా.. సైలెంట్‌గా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా అభ్యర్థిగా తిరుచ్చి శివ
అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం.. రైతుల ఆగ్రహం
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 19 , 2025 | 08:18 AM