Ganesh Nimajjanam at Tank Bund: గణేశ్ విగ్రహాల నిమజ్జనంతో ట్యాంక్ బండ్ వద్ద సందడి
ABN, Publish Date - Sep 06 , 2025 | 10:34 AM
హైదరాబాద్ సిటీలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గణేశ్ విగ్రహాల నిమజ్జనంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.
హైదరాబాద్: నగరంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గణేశ్ విగ్రహాల నిమజ్జనంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. పదకొండు రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్ బండ్‌తో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
Updated at - Sep 06 , 2025 | 10:38 AM