పూణే ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 27 , 2025 | 09:02 PM

మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకున్న అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి ఘటనల్లో సరైన దర్యాప్తు, కఠిన చర్యలు కీలకమన్నారు. నిర్భయ ఘటనల తర్వాత చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని.. అయితే చట్టాలతోనే ఇటువంటి ఘటనలను నివారించలేమన్నారు.

మహిళల కోసం తీసుకు వచ్చిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. ఇటువంటి కేసుల్లో సరైన దర్యాప్తు, కఠిన చర్యలు అత్యంత కీలక మన్నారు. న్యాయవ్యవస్థ, పోలీసులతోపాటు సమాజానికి బాధ్యత ఉందని మాజీ సీజేఐ డి వై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేేయండి..

Updated at - Feb 27 , 2025 | 09:08 PM