Gandhi Bhavan: గాంధీభవన్‌ నుంచి పిలుపులు.. దేని కోసమో

ABN, Publish Date - Mar 06 , 2025 | 04:43 PM

Gandhi Bhavan: గాంధీభవన్‌ నుంచి పలువురు కాల్స్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు ముప్పై మందికి గాంధీభవన్ సబ్బంది కాల్స్ చేసి ఈరోజు రావాల్సిందిగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, మార్చి 6: గాంధీభవన్ (Gandhi Bhavan) నుంచి పలువురికి పిలుపు వచ్చింది. పార్టీ కోసం కష్టపడిన వారికి మాత్రమే పదువులు ఇస్తామని ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Congress party in-charge Meenakshi Natarajan) స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్‌కు ఆశావాహులు క్యూ కడుతున్నారు. గత రాత్రి గాంధీభవన్ సిబ్బంది పలువురికి కాల్ చేసి ఈరోజు గాంధీభవన్‌కు రావాల్సిందని.. ప్రత్యేక సమావేశం ఉందని తెలిపినట్లు సమాచారం. ఒక 30 మందికి గాంధీభవన్‌ నుంచి కాల్స్ వెళ్లినట్లు సమాచారం.


సిబ్బంది నుంచి ఫోన్ కాల్ అందుకున్న వారు ఈరోజు (గురువారం) గాంధీభవన్‌కు వచ్చారు. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన డీసీసీ అధ్యక్షులు, పలువురు ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కనీసం పది సంవత్సరాలకు పైగా ఉన్నవారికి, అలాగే పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు వస్తాయని ఇటీవల మీనాక్షి నటరాజన్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంల గాంధీభవన్‌కు వచ్చిన వారితో ఏఐసీసీ సెక్రటరీలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

Jagan Argument : అయోమయం... జగన్‌‘వాదం’!

Leopard sighting video viral: పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 06 , 2025 | 04:46 PM