అమరావతితో కాదు.. చైనాతో పోటీ: సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Jan 23 , 2025 | 02:04 PM
దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి, ముంబై, బెంగళూరుతో కాదు.. చైనాతోనే తమకు పోటీ అని అన్నారు. దీంతో అక్కడున్న నేతలందరూ నవ్వులు చిందించారు.
సింగపూర్: దావోస్‌లో సీఎంల సమావేశంలో ఆపక్తికరమైన సన్నివేశం జరిగింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రల సీఎంల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి, ముంబై, బెంగళూరుతో కాదు.. చైనాతోనే తమకు పోటీ అని అన్నారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, ఫడ్నవీస్ నవ్వులు చిందించారు.
కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటనలో మరో కీలక అడుగు (Another key step) ముందుకు పడింది. హైదరాబాద్‌లో విప్రో సంస్థ విస్తరణకు (Wipro Company Expansion) అంగీకారం కుదిరింది. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో 5 వేల మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సమావేశం అయ్యారు. భేటీ అనంతరం విప్రో విస్తరణపై కీలక ప్రకటన విడుదల చేశారు. రాబోయే రెండు మూడేండ్లలో కొత్త ఐటీ సెంటర్ పూర్తి కానుంది. విప్రో విస్తరణ ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
Hydra Effect: నిజాంపేట్‌లో హైడ్రా కొరడా
వైఎస్సార్‌సీపీ కొత్త గేమ్.. రంగంలోకి బాలయ్య..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 23 , 2025 | 02:06 PM