పవన్‌ని అభినందిస్తున్నా: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Feb 15 , 2025 | 09:50 PM
మా మిత్రుడు పవన్ కళ్యాణ్ మంచి పనికి సహకరించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50లక్షల విరాళం ఇవ్వడం అభినందనీయమని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో "యుఫోరియా మ్యూజికల్ నైట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మా మిత్రుడు పవన్ కళ్యాణ్ మంచి పనికి సహకరించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50లక్షల విరాళం ఇవ్వడం అభినందనీయమని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో "యుఫోరియా మ్యూజికల్ నైట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ స్టార్ట్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి .. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ హాజరయ్యారు.