రాష్ట్ర అభివృద్ధే నా లక్ష్యం..

ABN, Publish Date - May 01 , 2025 | 04:48 PM

ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా..నా రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా..నా రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. అలాగే వర్చువల్‌గా 11 ఎంఎస్‌ఎంఈ పార్కులను సీఎం మొదలుపెట్టారు.14 ఎఫ్‌ఎఫ్‌సీలు,25 ఎంఎస్‌ఎంఈ పార్కులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం దగదర్తిలో త్వరలోనే ఎయిర్ పోర్టు పనులు ప్రారంభించి, త్వరగా పూర్తి చేస్తామన్నారు. పోర్టులు,రైల్వే లైన్లు, నేషనల్ రోడ్లు వస్తాయన్నారు. ఇప్పటికే చాలా పరిశ్రమలు వచ్చాయి. ఇంకా పరిశ్రమలు వస్తాయన్నారు. సోమశిల నీరు ఆత్మకూరుకి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు.

మరిన్నీ ఏబీఎన్ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 01 , 2025 | 04:49 PM