చేవెళ్ల బస్సు ప్రమాదం.. కన్నీళ్లు పెట్టిన కన్నతండ్రి మాటలు..

ABN, Publish Date - Nov 03 , 2025 | 06:55 PM

రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో 19 మంది దాకా మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.

రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో 19 మంది దాకా మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. సోమవారం ఉదయం ముగ్గురు అక్కా చెల్లెళ్లను కన్న తండ్రి స్వయంగా బస్టాప్‌లో దింపి వెళ్లాడు. బస్సు బయలు దేరిన కొంత సేపటికే ప్రమాదానికి గురైంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్పాట్‌లోనే చనిపోయారు. కూతుళ్ల మరణం గురించి తెలిసి కన్నతండ్రి గుండెలు అవిసేలా రోధిస్తున్నాడు. కూతుళ్ల చివరి మాటలు గుర్తు చేసుకుంటున్నాడు.


ఇవి కూడా చూడండి

కంకర పడి ఊపిరాడక 8 మంది మహిళలు మృతి

మద్యం మత్తులో టిప్పర్ డ్రైవర్.?

Updated at - Nov 03 , 2025 | 06:56 PM