రైల్వే గేట్ లాక్.. పట్టాలపై కారు

ABN, Publish Date - Dec 06 , 2025 | 09:42 PM

రైల్వే గేటు దాటుతున్న క్రమంలో సిబ్బంది గేటు వేయటంతో ఓ కారు పట్టా మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వేగేట్ దగ్గర చోటుచేసుకుంది.

రైల్వే గేటు దాటుతున్న క్రమంలో సిబ్బంది గేటు వేయటంతో ఓ కారు పట్టా మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వేగేట్ దగ్గర చోటుచేసుకుంది. గేటు ఓపెన్ కాకపోవటంతో పలు రైళ్లను నిలిపివేయాలని అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రైలు పట్టాలపై కారు నిలిచిపోవటంతో కారు డ్రైవర్ భయంతో అల్లాడిపోయాడు. మొత్తానికి గేటును కట్ చేసి కారును పక్కకు తీశారు. కారు డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి చదవండి

ఏం చేశారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్

ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. సడన్‌గా భూకంపం.. చివరకు చూస్తే..

Updated at - Dec 06 , 2025 | 09:42 PM