ఈసీకి ఎంపీ డీకే అరుణ ఫోన్.. పంచాయతీల ఏకగ్రీవం‎పై కీలక వ్యాఖ్యలు..

ABN, Publish Date - Dec 11 , 2025 | 08:21 PM

రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది ఎన్నికల సంఘం. సుమారు 60 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ ఈసీకి ఫోన్ చేసినట్టు సమాచారం. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుని ఎన్నుకోవాల్సిన సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవం చేయడంపై ఈసీతో సంభాషించినట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

ఓటుచోరీ గురించి మాట్లాడమంటే అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారు: రాహుల్

ఇండిగో కీలక నిర్ణయం.. ఆ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.!

Updated at - Dec 11 , 2025 | 08:34 PM