అంతా తూచ్.. మళ్లీ అసెంబ్లీకి రావాల్సిందే..! జగన్ గెట్ రెడీ
ABN, Publish Date - Feb 25 , 2025 | 09:57 PM
అనర్హత వేటు నుంచి తప్పించుకొనేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పడరాని పాట్లు పడుతున్నారు. సోమవారం అసెంబ్లీకి హాజరైనప్పటికీ.. అది వర్కింగ్ డే కాదని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుసగా వచ్చిన కథనాలు జగన్‌లో కలవరపాటుకు గురి చేశాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 21వ తేదీ వరకు జరగనున్నాయి.
అనర్హత వేటు నుంచి తప్పించుకొనేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పడరాని పాట్లు పడుతున్నారు. సోమవారం అసెంబ్లీకి హాజరైనప్పటికీ.. అది వర్కింగ్ డే కాదని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుసగా వచ్చిన కథనాలు జగన్‌లో కలవరపాటుకు గురి చేశాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరవుతారంటూ ఓ చర్చ అయితే ఆ పార్టీలో కొనసాగుతోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతానంటూ 10 రోజుల క్రితం వైఎస్ జగన్ ప్రకటించారు.
కానీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు అసెంబ్లీకి హాజరై.. సభను ఆయన బాయ్ కాట్ చేశారు. అయితే తొలిరోజు గవర్నర్ ప్రసంగం చేస్తారు. దీనిని సభ జరిగిన రోజుగా అసెంబ్లీ అధికారులు ప్రకటించరు. ఈ నేపథ్యంలో ఆ రోజు లెక్కలోకి రాదు.. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ఓ రోజు అసెంబ్లీకి హాజరు కావాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు ఆ పార్టీలో లీకులు వస్తున్నాయి.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 25 , 2025 | 10:06 PM