Balapur Laddu: రూ.35 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

ABN, Publish Date - Sep 06 , 2025 | 10:23 AM

బాలూపూర్ లడ్డూ వేలం పాటకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారరు. ఈ ఏడాది లడ్డూ రికార్డ్ ధర పలికింది.

బాలాపూర్ గణేశ్ లడ్డూ రికార్డ్ ధర పలికింది. వేలం పాటలో రూ.35 లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. లడ్డూను దక్కించుకోవడానికి పలువురు భక్తులు పోటీపడ్డారు. మరోవైపు వేలం పాటను చూసేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు. లడ్డూ వేలం పాట సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.30.01లక్షలు పలికిన విషయం తెలిసిందే.


లడ్డూ వేలం అనంతరం హుస్సేన్‌సాగర్ వైపు బాలాపూర్ వినాయకుడు శోభాయాత్ర కొనసాగనుంది. బాలాపూర్ నుంచి 16కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగనుంది. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, లిబర్టీ చౌరస్తా మీదుగా శోభాయాత్ర కొనసాగనుంది.

Updated at - Sep 06 , 2025 | 10:58 AM