రాజీనామా చేయకపోతే అరెస్ట్ చేపిస్తా అంటూ బెదిరించాడు
ABN, Publish Date - Feb 01 , 2025 | 09:24 PM
గత వైసీపీ హయాంలో తన అసోసియేషన్‌ను అడ్డుకోవాలని విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారని ఏపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పురుషోత్తం ఆరోపించారు. తమ అసోసియేషన్ సభ్యులను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారని చెప్పారు.
గత వైసీపీ హయాంలో తన అసోసియేషన్‌ను అడ్డుకోవాలని విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారని ఏపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పురుషోత్తం ఆరోపించారు. తమ అసోసియేషన్ సభ్యులను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారని చెప్పారు. 2019 సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఏపీ ఒలింపిక్స్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ అందరిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారన్నారు.
తమను సీఎం కార్యాలయానికి పిలిపించి.. మీరంతా రాజీనామా చేయాలన్నారన్నారు. తమ ప్రభుత్వం ఫ్రెష్‌గా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చెప్పారు.. మీరు తక్షణమే రాజీనామా చేయాలన్నారు. అయితే ఇదీ మీ పరిధిలోనిది కాదని విజయసాయిరెడ్డికి స్పష్టం చేశామన్నారు. రూల్స్ సైతం ఒప్పుకోవని ఆయన వివరించామన్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 01 , 2025 | 09:25 PM