మినిస్టర్ నాగబాబు ..?

ABN, Publish Date - Mar 03 , 2025 | 10:28 PM

ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో నాలుగు టీడీపీకి ఒకటి జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్ష్ కొనసాగుతోండగా.. జనసేన పార్టీ నుంచి మాత్రం నాగబాబుకు ఖరారైనట్లు సమాచారం.

ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో నాలుగు టీడీపీకి ఒకటి జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్ష్ కొనసాగుతోండగా.. జనసేన పార్టీ నుంచి మాత్రం నాగబాబుకు ఖరారైనట్లు సమాచారం. శాసన మండలిలో టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుంది. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నెల 20వ తేదీన ఒకే రోజు పోలింగ్.. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.


ఇక ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సైతం ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అందులో ఒకటి జనసేన, మిగతా నాలుగు స్థానాల నుంచి టీడీపీ పోటీ చేయనుంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో.. పార్టీలో అభ్యర్థిత్వాల కోసం తీవ్ర పోటీ నెలకొంది.ఇప్పటికే సీఎం చంద్రబాబు.. జనసేన నేత నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం నాగబాబుకు ఖరారైనట్లేనని తెలుస్తోంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 03 , 2025 | 10:28 PM