అంతర్వేదిలో ఉద్రిక్తత.. ఏం జరిగిందంటే
ABN, Publish Date - Mar 20 , 2025 | 04:31 PM
Tension In Antarvedi: అక్రమంగా వెలసిన ఆక్వా చెరువుల తొలగింపుతో అంతర్వేదిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది.
కోనసీమ జిల్లా, మార్చి 20: జిల్లాలోని అంతర్వేదిలో (Antarvedi) ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలతో అంతర్వేది, పల్లిపాలెం గ్రామాల్లో అక్రమంగా వెలసిన ఆక్వా చెరువులను తొలగించేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక విషయం తెలుసుకున్న ఆక్వా రైతులు అధికారులను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సముద్రతీరానికి 200 మీటర్ల దూరంలో ఆక్వా చెరువులు తవ్వకూడదని ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్జీటీ నిబంధనలు ఉల్లంఘిస్తూ పలువురు రైతులు అక్రమంగా ఆక్వా చెరువులను నిర్వహిస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై రైతులు స్పందించకపోవడంతో చెరువులను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
Bank Holidays: నాలుగురోజులు నిలిచిపోనున్న బ్యాంకు సేవలు.. ఎందుకంటే
Harish Rao Big Relief: హరీష్‌రావుకు భారీ ఊరట.. కేసు కొట్టివేత
Read Latest Telangana News And Telugu News
Updated at - Mar 20 , 2025 | 04:32 PM