డ్రోన్లకు చిక్కిన పందెంరాయుళ్లు.. వీడియో వైరల్..
ABN, Publish Date - Oct 08 , 2025 | 09:17 PM
కోడిపందెం, పేకాటరాయుళ్లకు జిల్లా పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడ జూదం ఆడినా.. డ్రోన్ల సహాయంతో నిందితులను పట్టుకుంటున్నారు.
అన్నమయ్య జిల్లా: కోడిపందెం, పేకాటరాయుళ్లకు జిల్లా పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడ జూదం ఆడినా.. డ్రోన్ల సహాయంతో నిందితులను పట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. రామసముద్రంలో కోడి పందేలు ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు అత్యాధునిక డ్రోన్లను పోలీసులు ప్రయోగించారు. నిందితులు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని జల్లెడ పట్టారు. చివరికి డ్రోన్ కంటికి జూదగాళ్ల జాడ తెలిసింది. అయితే డ్రోన్లను చూసిన వెంటనే వారంతా పరుగులు తీయడం ప్రారంభించారు. అటవీ ప్రాంతాల్లో దాక్కునేందుకు ప్రయత్నించారు. అయినా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పందెంరాయుళ్లను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read:
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ఫ్రైజ్..
మాజీ సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్..
అభ్యర్థుల ఖరారుకు బీజేపీ కీలస సమావేశం
Updated at - Oct 08 , 2025 | 09:17 PM