అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రాలు గల్లంతు

ABN, Publish Date - Mar 18 , 2025 | 04:45 PM

Exam Question Paper Missing: పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ పేపర్ గల్లంతవడం తీవ్ర కలకలం రేపుతోంది. రాయదుర్గంలోని ఓపెన్ స్కూల్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అనంతపురం, మార్చి 18: జిల్లాలో విద్యాశాఖ అధికారుల వైఫల్యం బయటపడింది. పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే రాయదుర్గంలోని ఓపెన్ స్కూల్‌‌లో పదో తరగతి ప్రశ్నాపత్రాలు (Exam Papers) గల్లంతయ్యాయి. ఉదయం కేంద్రంలోకి వెళ్లి చూడగా ప్రశ్నాపత్రాలు కనిపించలేదు. పలు చోట్ల వెతికినా దొరకలేదు. కాగా ఈ కేంద్రంలో హిందీ సబ్జెక్ట్ ఒక్కరే రాస్తూ ఉండటంతో పక్కా కేంద్రానికి వెళ్లి ప్రశ్నాపత్రాన్ని తీసుకుని వచ్చి విద్యార్థిని చేత ఆలస్యంగా పరీక్ష రాయించారు. విషయం తెలిసిన విద్యాశాఖ అధికారులు రాయదుర్గం చేరుకుని అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.


మరోవైపు ఓపెన్ స్కూల్ రాస్తున్న విద్యార్థినికి ప్రశ్నాపత్రానికి బదులుగా ఫోన్ వైర్ సెట్‌ ద్వారా అధికారులు ప్రశ్నాపత్రం అందించినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం గల్లంతుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Chittoor man snake bite: అయ్యోపాపం సుబ్రహ్మణ్యం.. బాబోయ్ ఇదెక్కడి పగరా నాయనా

WhatsApp Governance: మా లక్ష్యమిదే.. వాట్సప్‌ గవర్నెన్సుపై లోకేష్

Read Latest AP News And Telugu News

Updated at - Mar 18 , 2025 | 04:47 PM