కుక్క కోసం సైరన్ తో అంబులెన్స్..! కంగుతున్న ట్రాఫిక్ పోలీసులు..!

ABN, Publish Date - Mar 04 , 2025 | 07:43 PM

అంబులెన్స్ డ్రైవ్‌ దుర్వినియోగంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోన్న పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులకు ఓ వింత ఘటన ఎదురైంది. కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం.. సైరెన్‌తో వెళ్తున్న అంబులెన్స్‌ను గుర్తించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అతి వేగంగా సైరెన్‌తో వచ్చిన అంబులెన్స్‌ను పంజాగుట్ట వద్ద ఆపారు. లోపల రోగి ఉన్నాడా? లేడా? అని చూసేందుకు డోర్ ఓపెన్ చేసిన పోలీసులకు అంబులెన్స్‌లో కుక్కను చూసి విస్తూ పోయారు.

ఏమిటిది అంటూ డ్రైవర్‌ను ప్రశ్నించగా.. మియాపూర్ ఆసుపత్రిలో కుక్కకు వేసెక్టమీ ఆపరేషన్ చేయించేందుకు తీసుకు వెళ్తున్నట్లు తెలిపాడు. దీంతో సైరెన్ దుర్వినియోగంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అంబులెన్స్ యజమానిపై కేసు నమోదు చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 04 , 2025 | 07:43 PM