మహాశివరాత్రికి ముస్తాబైన శ్రీకాళహస్తి ఆలయం

ABN, Publish Date - Feb 20 , 2025 | 09:25 PM

దక్షిణ కైలాసంగా ఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దమైంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయంతోపాటు స్వామి వారి సేవలకు వినియోగించే వాహనాలను ఇప్పటికే శుద్ది చేశారు. ఆ క్రమంలో రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

ఈ పదమూడు రోజుల పాటు.. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనాన్ని స్వామివారి సేవల కోసం వినియోగిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తికి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఉచిత ప్రసాదాలు.. ఇక మహిళలకు అమ్మవారి ప్రసాదాలను అందజేయనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు తెలిపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 20 , 2025 | 09:25 PM