Share News

Air India flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

ABN , Publish Date - Jun 29 , 2025 | 09:54 PM

టోక్యో-ఢిల్లీ ఎయిర్ ఇండియా AI 357 బోయింగ్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానం టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Air India flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

టోక్యో-ఢిల్లీ ఎయిర్ ఇండియా AI 357 బోయింగ్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానం టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం క్యాబిన్‌లో ఉష్ణోగ్రత పెరగడాన్ని గుర్తించిన సిబ్బంది.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని కోల్‌కతాలో ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానంలో తనిఖీలు చేస్తున్నామని, ప్రయాణికులను త్వరగా ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

Updated Date - Jun 29 , 2025 | 09:54 PM