అమ్మాయిలకు గుడ్ న్యూస్.. అందానికి ఏఐ తోడు
ABN, Publish Date - Jan 19 , 2025 | 12:23 PM
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజలు కూడా అప్డేట్ అవుతున్నారు. ఇప్పుడు అన్నీరంగాల్లోనూ ఏఐ టెక్నాలజీ హవానే నడుస్తోంది. దీంతో బ్యూటీ స్టార్టప్‌లు, కాస్మోటిక్ సంస్థలు కూడా అదే బాట పట్టాయి.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజలు కూడా అప్డేట్ అవుతున్నారు. ఇప్పుడు అన్నీరంగాల్లోనూ ఏఐ టెక్నాలజీ హవానే నడుస్తోంది. దీంతో బ్యూటీ స్టార్టప్‌లు, కాస్మోటిక్ సంస్థలు కూడా అదే బాట పట్టాయి. అందానికి ఏఐ టచ్ ఇచ్చి రియల్ టైం ఎక్స్‌పీరియన్స్ అందిస్తామని అంటున్నాయి. అందాన్ని, ఆడవాళ్లను విడదీసి చూడలేమంటారు. సహజంగా ఉండే రూపాన్ని మరింత మెరిపించేందుకు, మెరుగులు దిద్దేందుకు ప్రయత్నించని మగువల సంఖ్యను వెళ్లపై లెక్కపెట్టవచ్చు. ఇక కాలం మారుతున్న కొద్దీ ఆడవాళ్లతో పాటు మగవాళ్లు కూడా అందంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. సౌందర్య పోషణకు నేటి యువత అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే అందం పేరుతో మన భారతదేశంలో భారీ వ్యాపారమే జరుగుతోంది. ఇక ప్రతి మహిళ ఖర్చు చేసే వంద రూపాయల్లో కనీసం 35 రూపాయలు అందానికే వెచ్చిస్తున్నాయని చెబుతున్నాయి నివేదికలు. అందుకే మహిళలకు అందంపై ఉండే మమకారాన్ని దృష్టిలో ఉంచుకుని కాస్మోటిక్ సంస్థలు పలురకాల ప్రోడక్ట్స్‌ను మార్కెట్లోకి దించుతున్నాయి. మహిళలకు అందంపై గల ఆసక్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మార్కెటింగ్ స్ట్రాటజీలను ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందానికి ఏఐ హంగులు అద్దుతున్నాయి పలు కంపెనీలు. ఇప్పడంతా ఏఐ టెక్నాలజీ నడుస్తుండటంతో అతివల అందాన్ని ద్విగుణీకతం చేసేందుకు ఏఐ బ్యూటీ ట్రెండ్స్‌ను సిద్ధం చేశాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 19 , 2025 | 12:29 PM