ABN Explosive: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అసలు నిజాలేంటి..?
ABN, Publish Date - Aug 31 , 2025 | 07:28 AM
Kaleshwaram Report: కాళేశ్వరం రిపోర్ట్ పై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇంతకు ఆ రిపోర్ట్ లో ఏముంది?, దీనిపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది?, ఇందుకు సంబంధించిన ప్రత్యేక కథనం.
కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం యావత్ తెలంగాణ వేచి చూస్తోంది. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల తలరాతలు మారుతాయని చెప్పిన గత ప్రభుత్వ పెద్దలు.. ఈ ప్రాజెక్ట్‌తో లక్షల కోట్లు సంపాదించుకున్నారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశిస్తూ ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. కాగా దాదాపు 15 నెలల పాటు విచారణ జరిపిన కమిషన్ ఇటీవల రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందించింది. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిపి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అసలు కాళేశ్వరం రిపోర్ట్ లో ఏముంది?.. సభలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ దీనిపై ఎలా స్పందిస్తుంది. దీనిపై ABN ప్రత్యేక కథనాన్ని కింది వీడియోలో చూడండి.
Updated at - Aug 31 , 2025 | 07:28 AM