Young India Police School: 'యంగ్ ఇండియా పోలీస్ స్కూల్' అడ్మిషన్లు
ABN , Publish Date - Oct 05 , 2025 | 06:55 PM
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రేహౌండ్స్ క్యాంపస్‌లో 'యంగ్ ఇండియా పోలీస్ స్కూల్' అడ్మిషన్ల ప్రక్రియ షురూ అయింది. ఈ స్కూల్ లో 50 శాతం అడ్మిషన్లు యూనిఫాం సిబ్బందికి, మిగిలిన 50 శాతం సీట్లు సాధారణ విద్యార్థులకు..
ఇంటర్నెట్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గతేడాది ఒక వినూత్న విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల గ్రేహౌండ్స్ క్యాంపస్‌లో 'యంగ్ ఇండియా పోలీస్ స్కూల్'ను ప్రారంభించింది. పని ఒత్తిడి కారణంగా విద్యపై దృష్టి పెట్టలేకపోతున్న పోలీసులు, యూనిఫాం సిబ్బంది పిల్లల విద్యాబుద్దుల అవసరాలను తీర్చడానికి ఈ సరికొత్త పాఠశాల నిర్మాణానికి సీఎం పూనుకున్నారు.
ఈ స్కూల్ లో 50 శాతం అడ్మిషన్లు యూనిఫాం సిబ్బందికి రిజర్వ్ చేస్తున్నారు. మిగిలిన 50 శాతం సీట్లు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ASI ర్యాంకు, హోమ్ గార్డులు, SI నుండి అదనపు SP ర్యాంక్, ఇంకా IPS వరకూ ఓపెన్ కేటగిరీలో వివిధ వర్గాలకు ఫీజులు సరసంగా భిన్నంగా ఉంటాయి.

ముఖ్యమంత్రి ఈ పాఠశాలకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేసి, పాఠశాలలో అడ్మిషన్ల ప్రారంభాన్ని ప్రకటించే వెబ్‌సైట్‌ను ప్రారంభించి శ్రీకారం చుట్టారు. ఈ స్కూల్ కలను సాకారం చేయడానికి అధికారుల బృందం రెండు నెలల పాటు పగలనక, రాత్రనకా పని చేసి గతేడాది కార్యరూపాన్ని తెచ్చాయి.
పాఠశాల నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ అనుమతులు, లీజు డీడ్‌లు, ఎంఓయులు, ప్రిన్సిపాల్, జనరల్ మేనేజర్, ఇంకా ఉపాధ్యాయుల నియామకం, ప్రాథమిక మౌలిక సదుపాయాల పనులు ఇక శరవేగంగా పూర్తి చేసి గతేడాది నుంచి అడ్మిషన్ల ప్రక్రియ షురూ చేశారు. ఈ పాఠశాలను ముఖ్యమంత్రి మార్చి 31, 2025న ప్రారంభించగా, మొదటి బ్యాచ్ విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు.
ఇక, ఇప్పుడు వచ్చే విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 25/9/25న జరిగిన YIPES బోర్డు సమావేశంలో, రాబోయే విద్యా సంవత్సరం (2026-27) కోసం దసరా రోజు అక్టోబర్ 2 నుండి YIPS పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News