Share News

Yadadri Thermal Plant: వచ్చే ఏడాది మార్చిలో యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ పూర్తి

ABN , Publish Date - Jul 23 , 2025 | 06:58 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లోని యూనిట్లన్నీ

Yadadri Thermal Plant: వచ్చే ఏడాది మార్చిలో  యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ పూర్తి

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లోని యూనిట్లన్నీ 2026 మార్చిలో అందుబాటులోకి రానున్నాయని కేంద్ర విద్యుత్‌ సంస్థ(సీఈఏ) ప్రకటించింది. ఈ మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి థర్మల్‌ కేంద్రాల నిర్మాణ పురోగతిపై రెండో త్రైమాసిక నివేదికను విడుదల చేసింది. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌లో భాగంగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చివరి యూనిట్‌-5.. 2026 మార్చిలో వాణిజ్య ఉత్పత్తి(సీవోడీ) ప్రారంభించనుందని పేర్కొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెంలో 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక్కోటి 800 మెగావాట్లు కలిగిన ఐదు యూనిట్లను తెలంగాణ జెన్‌కో నిర్మిస్తోంది. ఇప్పటికే రెండు యూనిట్లు(1-2) విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. మూడో యూనిట్‌ రానున్న డిసెంబరు కల్లా, నాలుగో యూనిట్‌ అక్టోబరు కల్లా, ఐదో యూనిట్‌ 2026 మార్చికల్లా పూర్తయితే.. ఒకేచోట 4 వేల మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కలిగిన ప్రాంతంగా వీర్లపాలెం రికార్డులకు ఎక్కనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 06:58 AM