Share News

Social Justice: ఇద్దరి ప్రాణాలను బలిగొన్న పెద్దమనుషుల తీర్పు!

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:54 AM

కట్టుకున్నవాడిని వదిలేసి, తనకు నచ్చిన వ్యక్తితో ఆమె వెళ్లిపోతే.. పరిహారం గా రూ.3 లక్షలను భర్తకు చెల్లించాల్సి ఉంటుందని ఊర్లో పెద్ద మనుషులు వెలువరించిన తీర్పు రెండు నిండు ప్రాణాలను బలిగొంది. అంత డబ్బు చెల్లించే స్థోమత లేకపోవడం, పరిహారం చెల్లించాల్సిందేనంటూ పెద్ద మనుషులు ఒత్తిడి తేవడంతో ఆ వివాహిత, ఆమె ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Social Justice: ఇద్దరి ప్రాణాలను బలిగొన్న పెద్దమనుషుల తీర్పు!

భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ

భర్తకు ఆమె 3 లక్షల పరిహారం ఇవ్వాలన్న పెద్దలు

చెల్లించే స్థోమత లేక ఆమె, ప్రియుడి ఆత్మహత్య

ములుగు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కట్టుకున్నవాడిని వదిలేసి, తనకు నచ్చిన వ్యక్తితో ఆమె వెళ్లిపోతే.. పరిహారం గా రూ.3 లక్షలను భర్తకు చెల్లించాల్సి ఉంటుందని ఊర్లో పెద్ద మనుషులు వెలువరించిన తీర్పు రెండు నిండు ప్రాణాలను బలిగొంది. అంత డబ్బు చెల్లించే స్థోమత లేకపోవడం, పరిహారం చెల్లించాల్సిందేనంటూ పెద్ద మనుషులు ఒత్తిడి తేవడంతో ఆ వివాహిత, ఆమె ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో ఈ ఘటన జరిగిం ది. గ్రామానికి చెందిన ఆలం అశ్విని (23)కి అదే గ్రామానికి చెందిన ఆలం కిరణ్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లయింది. అదే గ్రామానికి చెందిన కిరణ్‌ సమీప బంధువు వరుసకు మరిది, అవివాహితుడైన ఆలం స్వామి (25)తో అశ్విని వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారం క్రితం భర్త కిరణ్‌ను వదిలేసి అశ్విని ఇంట్లోంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి స్వామితో కలిసి అతడి ఇంట్లో ఉంటోంది. దీనిపై ఇటీవల కిరణ్‌ ఊర్లో పంచాయితీ పెట్టాడు. తనను కాదనుకొని వెళ్లిపోయిన అశ్విని తనకు కూడా అవసరం లేదని.. అయితే తనకు పరిహారంగా రూ.3లక్షలు చెల్లించాలని భర్త డిమాండ్‌ చేశాడు. పంచాయితీలో కూర్చున్న పెద్ద మనుషులు ఆ మొత్తాన్ని కిరణ్‌కు అశ్విని చెల్లించాలని తీర్మానించారు. తీవ్ర మనస్తాపానికి గురైన స్వామి, అశ్విని మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ మృతిచెందారు. స్వామి తల్లి ఫిర్యాదు మేరకు కన్నాయిగూడెం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For National News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 05:55 AM