Share News

Private Bus Accident: హైవేపై ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు..

ABN , Publish Date - Nov 11 , 2025 | 06:12 AM

హైదరాబాద్-విజయవాడ 65 వ జాతీయ రహదారిపై మరో ప్రమాదం సంభవించింది. విహారీ ట్రావెల్స్‌ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. చిట్యాల మండలం పిట్టంపల్లి దగ్గరకు చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి.

Private Bus Accident: హైవేపై ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు..

హైదరాబాద్-విజయవాడ 65 వ జాతీయ రహదారిపై మరో ప్రమాదం సంభవించింది. విహారీ ట్రావెల్స్‌ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. చిట్యాల మండలం పిట్టంపల్లి దగ్గరకు చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సును రోడ్డు పక్కన ఆపి, వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో లోపల ఉన్న వారంతా వెంటనే బస్సు దిగిపోయారు. ఈ ఘటనలో బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిప్రమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

Updated Date - Nov 11 , 2025 | 06:12 AM